: ఒక్క 'డాట్ బాల్' కూడా లేని బ్యాటింగ్ పవర్ ప్లే... క్రికెట్ చరిత్రలో తొలిసారి


వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు మరో అరుదైన రికార్డును సృష్టించింది. క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాటింగ్ పవర్ ప్లే లో ఒక్క 'డాట్ బాల్' కూడా లేకుండా దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ కొనసాగించింది. ఇన్నింగ్స్ లో 36 నుంచి 40 ఓవర్ల వరకూ బ్యాటింగ్ పవర్ ప్లే తీసుకున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆ ఐదు ఓవర్లలో 72 పరుగులు పిండుకున్నారు. సింగిల్స్ తీయడం లక్ష్యంగా ఆడుతూ, వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ, డివిలియర్స్, రోసూవ్ లు జాగ్రత్తగా ఆడారు.

  • Loading...

More Telugu News