: వ్యాపార ప్రకటనల్లోనూ ఆమిర్ రికార్డ్... గంట షూటింగ్ కు రూ.2 కోట్లు!


నమ్మశక్యం కాకున్నా నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే, 'పీకే' సినిమాలో అమాయకుడి పాత్ర వేసి రూ.500 కోట్లకు పైగా కొల్లగొట్టిన బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్... యాడ్ లో కనిపించాలే కాని, రెండేంటీ, ఎంతైనా చెల్లించేందుకు బడా కంపెనీలు చెక్కుబుక్కులతో సిద్ధంగా ఉన్నాయి. వివరాల్లోకెళితే, తన భార్య కిరణ్ రావుతో కలిసి ఆమిర్ ఖాన్ ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించి గంట పాటు షూటింగ్ లో పాల్గొన్నాడట. ఇందుకు అతడికి గృహోపకరణాల తయారీ సంస్థ రూ.2 కోట్లు చెల్లించిందట. ఇప్పటికే యాడ్ ఎండార్స్ మెంట్లలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆమిర్, కేవలం గంట పాటు షూటింగ్ కోసం రూ.2 కోట్లు తీసుకోవడంపై ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముంబైకి చెందిన ఓ టాబ్లాయిడ్ రాసిన ఈ వార్త నిజమైతే, యాడ్ లో ఆమిర్ ను సతీసమేతంగా చూడవచ్చు.

  • Loading...

More Telugu News