: ఈ దఫా బౌలింగ్ లో సత్తా... ఒకే ఓవర్లో 2 ముఖ్య వికెట్లు తీసిన గేల్
సిడ్నీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో విధ్వంస బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ వరుసగా రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బతీశాడు. అర్ధశతకాలతో రాణించి ప్రమాదకరంగా మారుతున్న డుప్లెసిస్ (62), ఆమ్లా (65)ను ఒకే ఓవర్‌లో గేల్ ఔట్ చేశాడు. అంతకుముందు సౌతాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు. మరో 7 వికెట్లు చేతిలో ఉండటంతో సఫారీలు భారీ స్కోర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.