: మోదీతో ముగిసిన ముఫ్తీ భేటీ... ఇక జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటే తరువాయి
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ భేటీ ముగిసింది. దాదాపు అర్ధగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, కనీస ఉమ్మడి ప్రణాళికపై చర్చించారు. ఇక ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయడమే మిగిలిని పని. సమావేశ అనంతరం మీడియాతో ముఫ్తీ మాట్లాడుతూ, జమ్ము కాశ్మీర్ లో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు. జమ్ములో బీజేపీకి, కాశ్మీర్ లో తమకు మద్దతు లభించిందని చెప్పారు. మార్చి 1న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుందని, రావాలని ప్రధానిని ఆహ్వానించానని తెలిపారు.