: ప్రధానితో పీడీపీ అధినేత ముఫ్తీ భేటీ... ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ


ఢిల్లీలో ఈ ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మహమ్మద్ సయీద్ భేటీ అయ్యారు. జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు, రెండు పార్టీల ఉమ్మడి ప్రణాళికపై వారు చర్చించనున్నారు. రెండు రోజుల కిందట కాశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఢిల్లీలో తొలిసారి భేటీ అయ్యారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు మొదటిసారి అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో నేడు మోదీతో సమావేశం అనంతరం కనీస ఉమ్మడి ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రమాణ స్వీకారం చేయడం, వెంటనే పీడీపీ-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువు దీరడం జరగనుంది.

  • Loading...

More Telugu News