: శ్రీవారు కరుణిస్తే... మీకూ అరుదైన సేవల భాగ్యం!
కలియుగ వైకుంఠనాధుడు కొలువైన తిరుమలలో టీటీడీ సామాన్య భక్తులకు కూడా అరుదైన సేవల భాగ్యాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సేవల్లో పాలుపంచుకోవాలంటే స్వయంగా దేవదేవుడు కాస్తంత కరుణించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఉండే టికెట్లు పదుల సంఖ్యలో, పోటీ వేళల్లో కాబట్టి. ముందుగా అరుదైన సేవా టికెట్లు బుక్ చేసుకొని, ఆపై తాము వస్తున్నామని టీటీడీకి సమాచారం ఇవ్వని వారి టికెట్లను, ఒకేసారి అధిక సంఖ్యలో బుక్ చేసుకున్న టికెట్లను టీటీడీ రద్దు చేస్తూ, వారి స్థానాల్లో లక్కీ డిప్ ద్వారా సామాన్య భక్తులకు చోటు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి నెల కోటా కింద తోమాల సేవ 41 టికెట్లు (ఒక్కొక్కరికి రూ.220), అర్చన 129 (రూ.220), మేల్ ఛాట్ వస్త్రం 9 (దంపతులు రూ.12,250), పూర్ణాభిషేకం 46 (రూ.750) టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పొందాలంటే ఒక రోజు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఆపై కంపూటర్ ద్వారా పేర్లు ఎంపిక చేస్తారు. రాత్రి 8 గంటలలోపు టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరి ఈ టికెట్లు రావాలంటే శ్రీవారి కరుణ ఉండాల్సిందే కదా!