: హైదరాబాదులో క్రెడిడ్ కార్డు క్లోనింగ్ ముఠా కలకలం... ఆంధ్రాబ్యాంకుకు ఫిర్యాదుల వెల్లువ


హైదరాబాదులో నేటి ఉదయం క్రెడిట్ కార్డుల క్లోనింగ్ ముఠా కలకలం రేగింది. క్రెడిట్ కార్డుల హోల్డర్ల ఖాతాల నుంచి భారీ మొత్తంలో సొమ్ము మాయమవుతోంది. ప్రధానంగా ఆంధ్రా బ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్లు ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. గడచిన పది రోజుల్లో రోజూ పదుల సంఖ్యలో ఆంధ్రా బ్యాంకు క్రెడిట్ కార్డుల విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే ఈ ఫిర్యాదులను బ్యాంకు అంతగా పట్టించుకోకపోవడంతో బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్రెడిట్ కార్డుల క్లోనింగ్ ముఠా ఒకటి ఈ మోసాలకు పాల్పడుతోందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హైదరాబాదుకు చెందిన క్రెడిట్ కార్డు హోల్డర్లకు సంబంధించిన ఖాతాల ద్వారా ముంబై, పుణే, ఢిల్లీల్లో మోసగాళ్లు కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో బాధితుల ఖాతాల్లో నుంచి ఇప్పటికే భారీ మొత్తంలో నగదు మాయమైంది. ఈ ముఠా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News