: గుట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు కల్యాణోత్సవం...స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న కేసీఆర్
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కల్యాణోత్సవం జరగనుంది. వారం రోజులుగా యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు జరగనున్న కల్యాణోత్సవానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటు సీఎం కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ తిరుమలగా భావిస్తున్న యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం గుట్ట వెళ్లిన కేసీఆర్, పలు అభివృద్ధి పనులపై సమగ్ర పరిశీలన జరపడంతో పాటు నిధుల విడుదలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.