: పొన్నం ప్రభాకర్ పై పరువునష్టం దావా వేసిన మంత్రి
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు. నల్గొండ జిల్లా సూర్యాపేట సివిల్ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు అయింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి, ఎలాంటి ఆధారాలు ఉన్నా ఏసీబీ అధికారులకు, పోలీసులకు చూపించి కేసు నమోదు చేయించాలని... లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలోనే, నేడు పొన్నంపై జగదీష్ రెడ్డి పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు.