: 'నమస్తే తెలంగాణ' పత్రిక ఓ చెల్లని కాగితం: రేవంత్ రెడ్డి
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కరీంనగర్ లో మాట్లాడుతూ, కేసీఆర్ మానస పుత్రిక 'నమస్తే తెలంగాణ' పత్రిక ఓ చెల్లని కాగితం అని ఎద్దేవా చేశారు. అందులో అవాస్తవాలే ఎక్కువని ఆరోపించారు. సచివాలయాన్ని తరలించేందుకు సర్కారు యత్నిస్తే తాము అడ్డుకుంటామన్నారు. తాను మైక్ పట్టుకుంటే టీఆర్ఎస్ నేతలు హడలిపోతున్నారని విమర్శించారు. మంత్రి ఈటెలకు తెలియకుండానే చెక్ పోస్టులు ఎత్తేశారని, అందుకు బాధ్యతగా ఈటెల రాజీనామా చేయాలని అన్నారు. అవినీతి భాగోతం బయటపెడతారనే జర్నలిస్టులపై కఠిన ఆంక్షలు విధించారని రేవంత్ మండిపడ్డారు.