: 92 పరుగుల తేడాతో శ్రీలంక విక్టరీ
మెల్బోర్న్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 92 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 333 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 47 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. రహమాన్ 53 పరుగులు చేశాడు. షకిబ్ అల్ హసన్ 46, ముష్ఫికర్ రహీం 36 పరుగులు చేశారు. భారీ భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. లంక బౌలర్లలో మలింగకు 3, లక్మల్ కు 2, దిల్షాన్ కు 2 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్ దిల్షాన్ 161, సంగక్కర 105 పరుగులతో అజేయంగా నిలిచారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దిల్షాన్ కు అందజేశారు.