: రైల్వే బడ్జెట్ పై పెదవి విరిచిన పెట్టుబడిదారులు... మార్కెట్ కు భారీ నష్టం


నేడు పార్లమెంట్ ముందుకు వచ్చిన రైల్వే బడ్జెట్ మార్కెట్ వర్గాలను మెప్పించలేక పోయింది. బడ్జెట్ తరువాత భారీగా పెరుగుతాయని ఆశలు పెట్టుకున్న రైల్వే సేవల కంపెనీల ఈక్విటీ వాటాల విలువలు భారీగా పడిపోయాయి. అటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ వాటాలు అమ్మి లాభాలను వెనక్కు తీసుకునేందుకే మొగ్గు చూపడంతో సెషన్ ఆరంభం నుంచి సూచీలు కోలుకోలేదు. క్రితం ముగింపు కన్నా 30 పాయింట్ల లాభంలో ప్రారంభమైన మార్కెట్ నిమిషాల వ్యవధిలో నష్టాల్లోకి నడిచింది. ఆపై మరే దశలోనూ కోలుకోలేదు. నేటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ సూచీ 261.34 పాయింట్లు పడిపోయి 0.90 శాతం నష్టంతో, 28,746.65 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచీ 83.40 పాయింట్లు కోల్పోయి 0.95 శాతం నష్టంతో 8,683.85 పాయింట్ల వద్ద కొనసాగాయి. మిడ్ కాప్, స్మాల్ కాప్ సెక్టార్లు ఒక శాతం వరకూ దిగజారాయి. సెన్సెక్స్ లో అత్యధికంగా యూనియన్ బ్యాంక్ 4.63 శాతం నష్టపోగా, సీమన్స్, పిపావవ్, రసోయ్ తదితర కంపెనీలు 4 శాతం కన్నా ఎక్కువగా నష్టపోయాయి. ఇదే సమయంలో ఎన్టీపీసీ, లూపిన్, డీఎల్ఎఫ్, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ తదితర కంపెనీలు లాభపడ్డాయి.

  • Loading...

More Telugu News