: భూసేకరణ గడువు పెంచేది లేదు... రైతులకు తెగేసి చెప్పిన చంద్రబాబు
రాజధాని ప్రాంతంలో భూసేకరణ గడువు పెంచేది లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ నెల 28తో గడువు ముగుస్తుందని తెలిపారు. గడువులోగా భూములు అప్పగించకపోతే ప్రభుత్వమే భూసేకరణకు దిగుతుందని అన్నారు. విజయవాడలో ఆయన గురువారం రాజధాని ప్రాంత రైతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతులు చంద్రబాబుతో మాట్లాడారు. జరీబు రైతులు తమకు 300 గజాల వాణిజ్య భూమి కావాలని అడగ్గా, సీఎం 200 గజాల భూమి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీనిపై రైతులు సంతృప్తి చెందినట్టు తెలిసింది. ఇక, పొలాలు తీసుకున్న గ్రామాల్లోనే స్థలాలు కేటాయించాలని వారు చంద్రబాబును కోరారు.