: రైల్వే బడ్జెట్ లో తెలంగాణ రైల్వే మార్గాల సర్వేకు అనుమతి
రైల్వే బడ్జెట్ లో అన్ని రాష్ట్రాల్లానే తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కొత్త రైళ్లు ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో రైల్వే మార్గాల సర్వేకు మాత్రమే మంత్రి అనుమతించారు. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, వరంగల్ లోని స్టేషన్ ఘన్ పూర్ కు, అదే విధంగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలలో సర్వే చేయనున్నారు. అంతేగాక ఛత్తీస్ గడ్ లోని కిరండోల్ మధ్య కొత్త రైల్వేలైన్ కు కూడా సర్వే చేపట్టనున్నారు.