: రైల్వే బడ్జెట్ పై మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం
ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమాత్రం న్యాయం జరగలేదని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు కూడా నిధులను కేటాయించలేదని మండిపడ్డారు. విభజన అనంతరం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నామని... అయినా కేంద్రం నుంచి ఆశించిన మేర నిధుల రాకపోవడంపై కేఈ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్ తో తీవ్ర నిరాశకు గురయినట్టు తెలిపారు.