: రైళ్లలో ఈ-క్యాటరింగ్ విధానం
ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్లలో ఈ-క్యాటరింగ్ విధానం ప్రవేశపెట్టినట్టు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. ఈ విధానాన్ని పరీక్షించేందుకు మొదట 108 రైళ్లలో ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేసుకున్నప్పుడు కావాల్సిన ఆహార పదార్థాలను కూడా ఆర్డర్ చేయవచ్చని తెలిపారు. రైళ్లలో ఆహార పదార్థాలను పంపిణీ చేయడానికి దేశంలో ఉత్తమ సంస్థలతో అనుసంధానం కానున్నట్టు మంత్రి చెప్పారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఈ సేవలను మరిన్ని రైళ్లలో ప్రవేశపెడతామని మంత్రి అన్నారు.