: పేలిన టైరు... ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు

ఢిల్లీ-కొచ్చి ఎయిరిండియా విమానం ప్రమాదం నుంచి బయటపడింది. ఈ ఉదయం కొచ్చి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలిపోయింది. విమానం టైర్లు నేలను తాకగానే ఈ ఘటన జరిగింది. అయితే, పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని నియంత్రించడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ఆ సమయంలో విమానంలో 161 మంది ప్రయాణికులున్నారు. ప్రస్తుతం విమానాన్ని ఇంజినీర్లు పరిశీలిస్తున్నట్టు ఎయిర్ పోర్టు ఉన్నతాధికారి ఏసీకే నాయర్ తెలిపారు. ఈ ఫ్లయిట్ మధ్యాహ్నం షార్జా బయల్దేరాల్సి ఉంది.