: రైల్వే కోసమేనన్న సూత్రం ఆధారంగానే రైల్వే బడ్జెట్: సురేశ్ ప్రభు
రైల్వే కోసమేనన్న సూత్రం ఆధారంగానే రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టామని మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ పెట్టామని తెలిపారు. ప్రయాణికుడికి మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశామని, రైళ్లలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. ముఖ్యంగా రైళ్లలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మహిళల రక్షణకు బోగీల్లో సీసీ కెమెరాలు, ఫోన్ సౌకర్యం, వృద్ధులు, వికలాంగుల కోసం స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టు సురేశ్ వెల్లడించారు. రైతుల సౌకర్యం కోసమూ కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పిన మంత్రి ఉద్యోగాల కల్పనకు బడ్జెట్ లో చోటు ఇచ్చామన్నారు.