: "గో బ్యాక్ బీజేపీ, టీడీపీ" అంటూ రోడ్డెక్కిన విశాఖ ప్రజలు
ఎంతో ఆశగా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటన వస్తుందని ఎదురుచూస్తూ కూర్చున్న ఉత్తరాంధ్ర ప్రజలకు నేటి రైల్వే బడ్జెట్ తీవ్ర వేదనను కలిగించింది. దీంతో ప్రజలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. "గో బ్యాక్ బీజేపీ, టీడీపీ ఎంపీలు" అంటూ ప్లకార్డులు చేతపట్టి ఆందోళన చేశారు. ప్రజాప్రతినిధుల అసమర్థత వల్లే రైల్వే బడ్జెట్ లో విశాఖకు తీరని అన్యాయం జరిగిందని ప్రజలు పేర్కొన్నారు. ఎంపీలు ఉండి కూడా ఎమీ చేయలేదని ఆరోపించారు. విశాఖలో రైల్వేజోన్ సాధించే వరకూ పోరాడతామని ఆంధ్రా యూనివర్శిటీ విద్యార్థులు హెచ్చరించారు.