: గెలుపు ముఖ్యం కాదు... మెజార్టీనే ముఖ్యం: ఎమ్మెల్యేలకు సూచించిన లోకేష్


ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుపై టీడీపీ యువనేత లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండానే ఈ ఎన్నికలో ఘన విజయం సాధించామని చెప్పారు. కేవలం బూత్ స్థాయి నిర్వహణ ఖర్చులు మాత్రమే పెట్టామని తెలిపారు. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చైతన్యరాజు అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా చూడాలని సూచించారు. గెలుపు ముఖ్యం కాదని, మెజార్టీ సాధించడమే ప్రధానమని అన్నారు.

  • Loading...

More Telugu News