: ఇకపై 2 కాదు, 4 నెలల ముందుగానే రైల్వే రిజర్వేషన్


రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించిన రైల్వే బడ్జెట్ ప్రజలను మెప్పించడంలో విఫలం అయినప్పటికీ, ప్రయాణికులకు ఓ కొత్త వరం లభించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయాన్ని 120 రోజులకు పెంచుతున్నట్టు ప్రభు ప్రకటించారు. ప్రస్తుతం అడ్వాన్స్ రిజర్వేషన్ 2 నెలల ముందుగా, అంటే... ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు నుంచి కొనుగోలు చేయవచ్చు. దీనిని 4 నెలలకు పెంచుతున్నట్టు రైల్వే మంత్రి తెలిపారు. దీంతో ప్రయాణికులకు 120 రోజుల ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే సదుపాయం కలగనుంది. అయితే, ఇది కూడా కొంత మందికి వరంగానే పరిణమిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

  • Loading...

More Telugu News