: తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్ముకున్న కరూర్ వైశ్యాబ్యాంక్!


కష్టాల్లో ఆదుకుంటాయని బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటే, బ్యాంకు ఉద్యోగులు అక్రమంగా ఆ బంగారాన్ని తక్కువ ధరకు విక్రయించుకున్నారని ఆరోపిస్తూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ ఘటన కడపలో జరిగింది. కడపలోని కరూర్ వైశ్యాబ్యాంక్ తమ బంగారాన్ని అమ్ముకుందని ఆరోపిస్తూ ఖాతాదారులు ఆందోళన బాట పట్టారు. నేటి ఉదయం బ్యాంక్ ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News