: తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి... ముగిసిన రైల్వే మంత్రి ప్రసంగం


అనుకున్నంతా అయ్యింది. రైల్వే బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కారు మొండి చేయి చూపించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం 2015-16కు సంబంధించిన రైల్వే బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు పలు కొత్త తరహా వసతులు, మెరుగైన సౌకర్యాలు ప్రకటించిన మంత్రి ఛార్జీల జోలికి వెళ్లలేదు. దేశంలోని కొత్త రైళ్ల ఊసెత్తని సురేశ్ ప్రభు, కొత్త రైల్వే లైను ఏర్పాటు లక్ష్యాన్ని కూడా భారీగా తగ్గించేశారు. సౌకర్యాల మెరుగుదలకు మాత్రమే పరిమితమైన రైల్వే బడ్జెట్ చప్పగా ఉందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. పలు నగరాల మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రస్తావించిన మంత్రి, తెలుగు రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారు. కాజీపేట-విజయవాడ మధ్య ట్రిపుల్ లైనును ప్రస్తావించిన సురేశ్ ప్రభు, ఇతర ప్రాజెక్టుల గురించి నోరు విప్పిన పాపాన పోలేదు. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు రెండు రైల్వే జోన్లంటూ సాగిన ప్రచారాన్ని కూడా ప్రభు నీరుగార్చేశారు. విశాఖ జోన్ ను అసలు మంత్రి ప్రస్తావించలేదు.

  • Loading...

More Telugu News