: రైల్వేబడ్జెట్ ప్రధాన అంశాలు-4
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో రైల్వే బడ్జెట్టును ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై లోక్ సభలో మంత్రి ప్రసంగం కొనసాగుతోంది. అందులోని ముఖ్యాంశాలు - రైల్వే బోర్డుల్లో ఫైనాన్సియల్ సెల్స్ - రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వ్యాపారీకరణకు ఆన్ లైన్ బిడ్డింగ్ - మేఘాలయను రైల్వే ట్రాక్ తో అనుసంధానం - రైల్వే భద్రతకు రూ.6,581 కోట్లు - రైల్వేల్లో వికేంద్రీకరణకు పెద్దపీట - కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైను నిర్మాణం - ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం మొబైల్ యాప్ - ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు 67 శాతం నిధులు - రైళ్లలో విద్యుత్ ఆదాకు చర్యలు - ఉత్తర రైల్వేలో సీఎన్జీ తో నడిచే డెమూ రైళ్లు - 2030 నాటికి రైల్వే విజన్ డాక్యుమెంట్