: రోజుకు 4 గంటలే నిద్రపోతున్న చంద్రబాబు
64 ఏళ్ల వయసులో ఎవరైనా వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రోజులో కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. మిగిలిన 20 గంటలు రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు కుమారుడు, టీడీపీ యువనేత లోకేష్ స్వయంగా వెల్లడించారు. ప్రజలకు మేలు చేయాలన్న తపనతోనే ప్రతి క్షణం తన తండ్రి పనిచేస్తున్నారని లోకేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి లోకేష్ వెళ్లిన సందర్భంలో, పలువురు టీడీపీ నేతలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ ఈ విషయం తెలిపారని సమాచారం. ఏదేమైనప్పటికీ, ఈ వయసులో రోజుకు 20 గంటలపాటు పనిచేస్తే, రాష్ట్రం బాగుపడే సంగతేమో కానీ, చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతినడం మాత్రం ఖాయం.