: 400వ మ్యాచ్ లో సంగా సెంచరీ... బంగ్లాదేశ్ లక్ష్యం 333
శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర తన 400వ వన్డే మ్యాచ్ లో శతకం నమోదు చేశాడు. మెల్బోర్న్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సంగా తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. వన్ డౌన్ లో వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్ మొత్తం 76 బంతులాడి 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. సంగా స్కోరులో ఓ సిక్సు, 13 ఫోర్లు ఉన్నాయి. అటు, ఓపెనర్ దిల్షాన్ (146 బంతుల్లో 161 నాటౌట్; 22 ఫోర్లు) కూడా చెలరేగిపోవడంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్ తిరిమన్నే 52 పరుగులు చేసి రూబెల్ హుస్సేన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లు ఐదుకు పైగా ఎకానమీ రేట్ తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు.