: రైల్వేబడ్జెట్ ప్రధాన అంశాలు-2
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై లోక్ సభలో మంత్రి ప్రసంగం కొనసాగుతోంది. అందులోని ముఖ్యాంశాలు... - రైళ్లలోని సాధారణ బోగీల్లోనూ మొబైల్ ఛార్జింగ్ సదుపాయం - రైళ్ల రాకపోకలపై ఎస్ఎంఎస్ సమాచారం - ఏ1, ఏ2 బోగీల్లో వై-ఫై సౌకర్యం - మహిళల బోగీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు - వృద్ధులు, వికలాంగులకు ఆధునిక సౌకర్యాలు - ఆన్ లైన్ లో వీల్ చైర్ రిజర్వ్ చేసుకునే వెసులుబాటు - పెట్టుబడుల కోసం బ్యాంకులు, పెన్షన్ ఫండ్ల వినియోగం - బీ స్టేషన్లలోనూ వై-ఫై సౌకర్యం - రైల్వే స్టేషన్లలో లిఫ్ట్, ఎస్కలేటర్ల ఏర్పాటు కోసం రూ.120 కోట్లు - 4 నెలల ముందు నుంచే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం - రద్దీగా ఉండే రూట్లలో తిరిగే రైళ్లలో జనరల్ బోగీల పెంపు - 108 రైళ్లలో ఈ-క్యాటరింగ్ వ్యవస్థ - తక్కువ ధరకే తాగునీరు - కొత్త రైల్వే లైన్ల కోసం రూ.8,600 కోట్లు - దేశవ్యాప్తంగా 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ నెంబరు: 138