: ఛార్జీలు యథాతథం: రైల్వే ఛార్జీల జోలికెళ్లని మంత్రి
రైలు ప్రయాణికుల ఛార్జీలు యథాతథంగా ఉంటాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. రైల్వే బడ్జెట్టులో భాగంగా కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన మంత్రి, ప్యాసింజర్ ఛార్జీలను పెంచట్లేదని స్పష్టం చేశారు. ఛార్జీలను యథాతథంగా ఉంచేందుకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యంతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతోనూ ముందుకు సాగుతామని ఆయన ప్రకటించారు. దేశంలో కొత్తగా 1.38 లక్షల కిలో మీటర్ల మేర రైల్వే లైనును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.