: మళ్లీ నటించేందుకు సిద్ధమే... కానీ అవకాశాలే లేవు: జెనీలియా
మూడు నెలల కిందట మగబిడ్డకు జన్మనిచ్చిన నటి జెనీలియా ప్రస్తుతం కొడుకును చూసుకుంటూ మాతృత్వపు అనుభూతిని పొందుతోంది. 2012లో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకోక ముందు నుంచే సినిమాల నుంచి విరామం తీసుకుంది. ఆ మధ్య భర్త మరాఠీలో నిర్మించి, నటించిన ఓ సినిమా పాటలో తళుక్కుమనగా, ఇటు సల్మాన్ ఖాన్ 'జై హో'లో కూడా కనిపించింది. ప్రస్తుతం జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, మళ్లీ నటించేందుకు సిద్ధమేనని తెలిపింది. కానీ, ప్రస్తుతం తనకెలాంటి అవకాశాలు లేవని చెప్పుకొచ్చింది.