: దిల్షాన్ సెంచరీ, సంగా ఫిఫ్టీ... భారీ స్కోరు దిశగా శ్రీలంక


మెల్బోర్న్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో శ్రీలంక జట్టు భారీస్కోరు దిశగా దూసుకుపోతోంది. 41 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 224 పరుగులు చేసింది. ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ (101) సెంచరీ సాధించగా, సంగక్కర (60) ఫిఫ్టీతో క్లాస్ చాటుకున్నాడు. పక్కా బ్యాటింగ్ పిచ్ పై లంకేయుల బ్యాటింగ్ ధాటికి బంగ్లా బౌలర్లకు చుక్కలు కనబడుతున్నాయి. అంతకుముందు, ఓపెనర్ తిరిమన్నే (52) కూడా అర్ధసెంచరీ నమోదు చేసుకున్న అనంతరం తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత దిల్షాన్, సంగా జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు.

  • Loading...

More Telugu News