: ఫిలింనగర్ ను టార్గెట్ చేసిన దొంగలు... భారీ దొంగతనం
హైదరాబాద్ నగరంలో పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి ఓ వైపు టీఎస్ సర్కారు భారీగా నిధులను, వాహనాలను సమకూరుస్తోంది. మరోవైపు అదే స్థాయిలో చోరులు కూడా తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ, జంటనగరాల పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి అత్యంత సంపన్నులు, సినీ ప్రముఖులు నివసించే ఫిలింనగర్ ను టార్గెట్ చేశారు దొంగలు. ఫిలిం నగర్ లోని రోడ్ నెంబర్-92లో ఉన్న ఓ ఇంట్లోకి చొరబడిన చోరాగ్రేశులు ఏకంగా రూ.40 లక్షల డబ్బును ఎత్తుకు పోయారు. సీన్ కట్ చేస్తే... అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. క్లూస్ టీమ్ ఇంటి పరిసరాలను పరిశీలించింది. దొంగలను పట్టుకుని తీరుతామని పోలీసులు తెలిపారు.