: డ్యునెడిన్ లో సస్పెన్స్ థ్రిల్లర్... వికెట్ తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్ జట్టు


వరల్డ్ కప్ గ్రూప్ దశలో భాగంగా డ్యునెడిన్ లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు పోరాడి నెగ్గింది. స్కాట్లాండ్ విసిరిన 211 పరుగుల లక్ష్యాన్ని 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్లో వార్డ్ లా విసిరిన బంతిని షాపూర్ జాద్రాన్ ఫోర్ గా మలిచి ఆఫ్ఘన్ జట్టును గెలిపించాడు. ఓ దశలో 132 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమనుకున్న దశలో, సమీయుల్లా షెన్వారీ (96) అద్భుత బ్యాటింగ్ తో జట్టును గెలుపుబాటలో నిలబెట్టాడు. 9వ వికెట్ కు హమీద్ హసన్ (15 నాటౌట్) తో కలిసి 60 పరుగులు జోడించాడు. అయితే, సెంచరీకి 4 పరుగుల దూరంలో అవుటయ్యాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' షెన్వారీకే దక్కింది. అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. మచాన్ (31), హక్ (31) టాప్ స్కోరర్లు. ఆఫ్ఘన్ బౌలర్లలో షాపూర్ జాద్రాన్ కు 4, దౌలత్ జాద్రాన్ కు 3 వికెట్లు దక్కాయి.

  • Loading...

More Telugu News