: న్యూఢిల్లీలో చర్చిల వద్ద భద్రత పెంపు
ఇటీవలకాలంలో ఢిల్లీలోని చర్చిలపై దాడులు జరగడంతో కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వందల సంఖ్యలో ఉన్న చర్చిల వద్ద భద్రత పెంచింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయమంత్రి హరిబాయ్ చౌదరి మాట్లాడుతూ, రాజధానిలోని 240 చర్చిల వద్ద అదనపు పోలీసు బలగాలతో భద్రత పెంచినట్టు తెలిపారు. అంతేగాక అన్ని మత కేంద్రాల వద్ద కూడా నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని వివరించారు. గతేడాది డిసెంబర్ లో ఐదు చర్చిలపై దహనకాండ లేదా దొంగతనం జరగగా, అటు కర్ణాటకలోని ఓ చర్చి ధ్వంసమైనట్టు మంగళూరు పోలీస్ అధికారి తెలిపారు.