: నిజాయతీగా మాట్లాడటమే తెలుసు... ఏ ఒక్కరినీ విమర్శించాలని కాదు: వెంకయ్య వివరణ
‘‘నిజాయతీగా మాట్లాడటమే తెలుసు. ఏ ఒక్కరిని కూడా విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్యలను విపక్షాలు అపార్థం చేసుకున్నాయి’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నేటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఆత్మపరిశీలన చేసుకోవాలన్న వెంకయ్య వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వెంకయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విపక్షాలు, ఆయనపై స్పీకర్ కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన వెంకయ్య, నిజాయతీగా మాట్లాడటమే తనకు తెలుసన్నారు. తన వ్యాఖ్యలను విపక్షాలు అపార్థం చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకయ్య వివరణ ఇచ్చినా, విపక్షాలు శాంతించకపోవడంతో లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.