: మంచుచరియలు విరిగిపడి 124 మంది దుర్మరణం


ఆఫ్ఘనిస్థాన్ ను అతలాకుతలం చేస్తున్న మంచు తుపాను ఇప్పటికే వందలాది మంది ప్రాణాలను బలిగొంది. తాజాగా ఈశాన్య ప్రాంతంలోని 4 రాష్ట్రాల పరిధిలో భారీగా మంచు కురుస్తుండగా, పంజషీర్ ప్రాంతంలో మంచుతో నిండిన కొండ చరియలు విరిగిపడి 124 మంది మృతి చెందారు. కాబూల్ కు 100 కి.మీ దూరంలో ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. మంచు చరియలు ఒక్కసారిగా ఊరిపై పడ్డాయని, సుమారు 100 ఇళ్ళు కుప్పకూలాయని వివరించారు. మంగళవారం నుంచి కురుస్తున్న మంచుతో మూడు అడుగుల మేర మంచు కప్పేసిందని, ఖాళీ చేతులతో మంచు తొలగిస్తూ, సహాయక చర్యలు చేపట్టాల్సి వస్తోందని తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు వున్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News