: కార్పొరేట్ గూఢచర్యం కేసులో పర్యావరణ శాఖ సిబ్బంది అరెస్టు


కార్పొరేట్ గూఢచర్యం కేసులో వరుసగా పలువురు అరెస్టవుతున్నారు. తాజాగా అటవీ, పర్యావరణశాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి వ్యక్తిగత సహాయకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతని పేరు జితేందర్ శర్మ అని, ఇంధన శాఖకు సంబంధించిన సమాచారాన్ని సలహాదారు లోకేష్ శర్మకు లీక్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని సమాచారం. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, ఇంధన శాఖలకు సంబంధించిన రహస్య పత్రాలు లీకు చేసిన గూఢచర్యం వ్యవహారంలో ఈ నెల 17, 20న రెండు ఎఫ్ఐఆర్ లను ఢిల్లీ పోలీసులు నమెదు చేశారు.

  • Loading...

More Telugu News