: శ్రీలంక ఓపెనర్ల సెంచరీ భాగస్వామ్యం
బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో శ్రీలంక ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. దిల్షాన్, తిరిమన్నే పోటాపోటీగా బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టుకు శుభారంభం లభించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పిచ్ బ్యాటింగుకు అనుకూలిస్తుండడంతో బంగ్లా బౌలర్లు చెమటోడ్చాల్సి వస్తోంది. తిరిమన్నే (52) వికెట్ కోల్పోయిన లంక 25 ఓవర్లకు 122 పరుగులు చేసింది. దిల్షాన్ (63 బ్యాటింగ్), సంగక్కర (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తిరిమన్నే వికెట్ హుస్సేన్ కు దక్కింది. స్టార్ బ్యాట్స్ మన్ సంగక్కర క్రీజులోకి రావడంతో స్టేడియంలో ఉన్న లంక అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.