: శ్రీదేవితో లిప్ లాక్ ముద్దు సీన్లు లేవు, ఇవన్నీ రూమర్లే!: సుదీప్


దక్షిణాది సినీరంగంలో బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి... అంచలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్ ను సైతం తన అందచందాలతో షేక్ చేసిన అతిలోక సుందరి శ్రీదేవి. అందానికి పర్యాయపదం శ్రీదేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ వయసులో కూడా తన అందంతో కట్టిపడేసే గ్లామర్ ఆమె సొంతం. అలాంటి శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ పై మళ్లీ తళుక్కుమనబోతోందన్న వార్త మీడియాలో హల్ చల్ చేసింది. అది కూడా కన్నడ స్టార్ హీరో, 'ఈగ' ఫేం సుదీప్ తో లిప్ లాక్ చేయబోతోందనే కథనం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. చింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఫాంటసీ తమిళ చిత్రం 'పులి'లో తమిళ స్టార్ హీరో విజయ్, హన్సిక, శృతిహాసన్ లు నటిస్తున్నారు. ఈ సినిమాలోనే శ్రీదేవి, సుదీప్ ల అధర చుంబన దృశ్యాలు ఉంటాయన్న వార్తలు దేశ వ్యాప్తంగా వ్యాపించి, షేక్ చేశాయి. దీనిపై హీరో సుదీప్ స్పందించాడు. శ్రీదేవితో ఎలాంటి లిప్ లాక్ లు లేవని, ఇవన్నీ కేవలం రూమర్లే అంటూ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుడతాయో కూడా అర్థం కావడం లేదని తెలిపాడు. ఈ ముద్దుల సన్నివేశం గురించి తనతో ఎవరూ చర్చించలేదని కూడా చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News