: రైలు ఛార్జీల పెంపు లేదట... సంకేతాలిచ్చిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు


రైలు ఛార్జీల పెంపుపై ఇక భయపడాల్సిన అవసరం లేదు. తన బడ్జెట్టులో ప్రయాణికులపై ఛార్జీల మోత మోగించడం లేదని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇప్పటికే సంకేతాలిచ్చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్టును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. నేటి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే మధ్యాహ్నం 12 గంటలకు సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. రైల్వే బడ్జెట్ నేపథ్యంలో ఈ దఫా ఛార్జీల పెంపు లేదన్న విశ్లేషణలు సాగాయి. సదరు విశ్లేషణలకనుగుణంగానే ఛార్జీల పెంపు ఉండబోదని మంత్రి సంకేతాలిచ్చారు.

  • Loading...

More Telugu News