: సంగక్కర '400'... నాటౌట్!


అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన స్టైల్, దూకుడు, సమయోచితమైన బ్యాటింగ్ శైలితో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప క్రికెటర్లలో శ్రీలంక ఆటగాడు సంగక్కర కూడా ఒకడు. శ్రీలంక జట్టు ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో సంగ పోషించిన పాత్ర అద్భుతం. ఈ లెజండరీ క్రికెటర్ బ్యాట్స్ మెన్ గానే కాక కీపర్ గా కూడా అమోఘమైన పాత్ర పోషించాడు. 37 ఏళ్ల సంగక్కర అనేక మ్యాచ్ లకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. సమకాలీన క్రికెట్ లో ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్న సంగక్కర నేడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రపంచ కప్ లో భాగంగా నేడు మెల్ బోర్న్ లో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ తో సంగక్కర 400 వన్డేలు ఆడిన ఆటగాళ్ల క్లబ్ లో చేరిపోయాడు. 2000 సంవత్సరంలో పాకిస్థాన్ తో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన సంగ... వన్డేల్లో ఇప్పటివరకు 13,739 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 93 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా సంగ ఇప్పటి వరకు 130 టెస్టులు ఆడి 12,203 పరుగులు చేశాడు. ఇందులో ఒక ట్రిపుల్ సెంచరీ (319) కూడా ఉంది.

  • Loading...

More Telugu News