: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడి మృతి... కృష్ణా జిల్లాలో ఘటన
కృష్ణా జిల్లాలో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు కింద పడిన మూడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. జిల్లాలోని మండవల్లి మండలం ఇంగిలిపాకలంకలో కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటనలో సాయి పబ్లిక్ స్కూల్ బస్సు కిందపడ్డ బాలుడు నవీన్ అక్కడిక్కడే చనిపోయాడు. ఘటన జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.