: మారిషస్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ‘రెడ్’ స్మగ్లర్ గంగిరెడ్డి
పోలీసులకు చిక్కిన ఎర్ర చందనం స్మగ్లర్ బెయిల్ కోసం యత్నాలు ప్రారంభించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అతడు, బెయిల్ పిటిషన్ దాఖలులోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బెయిల్ ఇవ్వండంటూ అతడు మారిషస్ లోని పోర్ట్ లూయిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇంటర్ పోల్ సహకారంతో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు మారిషస్ ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అతడు మారిషస్ లోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేసి పోలీసులకు సవాల్ విసిరాడు. అయితే బెయిల్ లభిస్తుందా, లేదా? అన్న అంశాన్ని పక్కనబెడితే, గంగిరెడ్డి పిటిషన్ నేపథ్యంలో కేసు వివరాలతో పాటు హైకోర్టు అతడికి బెయిల్ తిరస్కరిస్తూ జారీ చేసిన తీర్పు కాపీని సీఐడీ పోలీసులు పోర్ట్ లూయిస్ కోర్టుకు పంపారు. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పోర్ట్ లూయిస్ కోర్టులో నేడు విచారణకు రానుంది.