: 8 నెలల్లో 67 ప్రత్యేక విమానాలు... రూ.15 కోట్ల ఖర్చు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రత్యేక విమానాల ప్రయాణ ఖర్చు రూ.15 కోట్ల రూపాయలట. సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక, గడచిన 8 నెలల్లో 67 సార్లు ప్రత్యేక విమానాల్లో ఆయన ప్రయాణించారు. ఇందుకు సంబంధించి రూ.15 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలు వేర్వేరుగా జీవోలు జారీ చేశాయి. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యే వరకూ వివిధ పనుల కోసం పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో విధుల్లోకి తీసుకోగా, వారికి గత 5 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగులో వున్నట్టు సమాచారం.