: గుట్టపై కేసీఆర్... అద్దాల మండపంలో జర్నలిస్టులు, ఆడిటోరియంలో భక్తులు!


తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్నటి యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆలయ పరిసరాల్లో అప్రకటిత కర్ఫ్యూ అమలు చేశారు. ఓ వైపు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా, పోలీసులు నిషేధాజ్ఞలను అమలు చేయక తప్పలేదు. ఎందుకంటే, తన పర్యటనలో మీడియా తన కంటబడకూడదని కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. సీఎం ఆదేశాలతో ఆలయానికి వచ్చిన భక్తులను హోటల్ గదుల నుంచి బయటకు రాకుండా తలుపులేసిన పోలీసులు, సీఎం పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా సిబ్బందిని ఆలయ పరిసరాల్లోని అద్దాల మండపంలో బంధించేశారు. ఇక వీధుల్లోని భక్తులను ఆడిటోరియంలోకి తోసేశారు. కాలకృత్యాలకు కూడా అనుమతించకుండా పోలీసులు భక్తులను నానా తిప్పలు పెట్టారట. బ్రహ్మోత్సవాల వేళ ఆంక్షలేమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా, సీఎం పర్యటనను కవర్ చేయమంటూ పాసులిచ్చి మరీ మండపంలో బంధించడమేంటని మీడియా సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News