: 'నా స్టైల్ నాదే...' తనను వేరొకరితో పోల్చొద్దంటున్న జానారెడ్డి


తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను వేరొకరితో పోల్చవద్దని చెప్పిన ఆయన తన స్టైల్ తనదేనని వ్యాఖ్యానించారు. స్థాయికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించడం తనకు అలవాటన్న జానారెడ్డి, ప్రభుత్వంపై తమది మెతక వైఖరి అనడం సరికాదన్నారు. ఏ ఒక్కరి కోసమో దూకుడుగా వ్యవహరించబోనని కూడా ఆయన ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కొందరు పార్టీ ఫిరాయించారని, వీరిపై చర్యల విషయంలో స్పీకర్, మండలి చైర్మన్ లు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యల కోసం ఉద్యమిస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News