: పాతబస్తీలో కానిస్టేబుళ్ల ఓవరాక్షన్... మద్యం మత్తులో వృద్ధ దంపతులపై దాడి
హైదరాబాదులోని పాతబస్తీలో రాత్రి ఇద్దరు కానిస్టేబుళ్లు ఓవరాక్షన్ చేశారు. ఫుల్లుగా మధ్యం తాగి మత్తులో తూగుతూ తనిఖీల పేరిట వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఓ వృద్ధ జంటపై వారు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడంతో పాటు కానిస్టేబుళ్లకు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను పట్టేసిన స్థానికులు మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.