: ఒడిలో పడుకుని ఫోటోకు పోజిచ్చాడు... చుక్కలు చూపించారు!
బెంగళూరులో మహ్మద్ రియాజ్ అనే విద్యార్థి క్లాసులోని అమ్మాయిల ఒడిలో పడుకుని ఓ ఫోటో తీయించుకున్నాడు. సరదాగా ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే, ఆ ఫోటో సోషల్ మీడియాలో శరవేగంతో పాకిపోయింది. దీంతో, కొన్ని కాషాయ సంఘాలు రంగంలోకి దిగాయి. ఆ విద్యార్థి చదువుతున్న కళాశాల ఎదుట ఆందోళన చేపట్టాయి. ఆ ఫోటోలో ఉన్న ఐదుగురు అమ్మాయిలు హిందువులు కావడంతో విషయం మతం రంగు పులుముకుంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు రియాజ్ ను కిడ్నాప్ చేసి చుక్కలు చూపారు. చితకబాది వదిలిపెట్టారు. ఇప్పుడా విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ ఫోటోను తన మిత్రులే సరదాగా తీశారని పేర్కొన్నాడు. ఇక, రియాజ్ తో పాటు అతడిని తమ ఒళ్లో పడుకోబెట్టుకున్న విద్యార్థినులను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.