: ఏ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లోనూ అకౌంట్ లేదు... అది ఫేక్: గాలి జనార్దనరెడ్డి
తన పేరిట ఎవరో ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు సమాచారాన్ని పోస్టు చేస్తున్నారని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి వాపోయారు. ఆ ఫేక్ అకౌంట్ లో పొందుపరిచిన సమాచారం తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉందని, అందుకు కారకుడిని గుర్తించి శిక్షించాలని కోరారు. తన అనుచరుడు శివకుమార్ ద్వారా ఆయన సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఫేస్ బుక్ లో ఎలాంటి అకౌంట్ లేదని, అసలు ఏ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లోనూ అకౌంట్ లేదని తెలిపారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో గాలి ఇటీవలే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు 40 నెలలు జైలులో గడిపారు.