: రైనా, అక్షర్ లతో గ్రిల్డ్ చికెన్ లంచ్... కోహ్లీ, షమీలతో షికారు... ధోనీ కొత్త పంథా!


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త పంథా అనుసరిస్తున్నాడు. జట్టు సభ్యులందరితోనూ కలివిడిగా ఉండేందుకు చొరవ ప్రదర్శిస్తున్నాడు. అందుకే, వీలు చిక్కినప్పుడల్లా సహచరులను వెంటేసుకుని ఆస్ట్రేలియా నగరాల్లో షికారు చేస్తున్నాడు. ఓసారి సురేశ్ రైనా, అక్షర్ పటేల్ లతో కలిసి వెళ్లి అడిలైడ్ బ్యాంక్ స్ట్రీట్ లో గ్రిల్డ్ చికెన్ లాగిస్తే... మరోసారి విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీలతో వెళ్లి లంచ్ తినేసి వస్తున్నాడు. ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు ముందు రైనా, జడేజాలను తీసుకెళ్లి మెక్సికన్ రాప్స్ తిని, ఫ్రూట్ జ్యూసు తాగి వచ్చాడట. జట్టు సభ్యులతో అనుబంధాన్ని పెంచుకునేందుకే ధోనీ ప్రయత్నమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News