: దేశవ్యాప్త మొబైల్ పోర్టబిలిటీకి ట్రాయ్ ఆదేశం
మొబైల్ నంబర్ పోర్టబిలిటీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది. ఇప్పటివరకు ఈ సౌకర్యం ఒక టెలికాం సర్కిల్ కే వర్తిస్తుండగా, మే 3 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులు ఈ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా... నెంబర్ మార్చుకోనవసరం లేకుండానే తమకు నచ్చిన నెట్ వర్క్ కు మారే సదుపాయం కలుగుతుంది.